సామాజిక విప్లవోద్యమ పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పులే…
Hanamkondaకాంగ్రెస్ భవన్ – 28-11-2022..
సామాజిక తత్వవేత్త, బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ మహాత్మా జ్యోతిరావు పులే 132 వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అయన సేవలను కొనియాడారు.
అనంతరం జిల్లా ఎస్.సి.డిపార్టుమెంటు చైర్మన్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ & జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ మాట్లాడుతూ..
కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతలకు గురయిన బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే.
సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం అంటూ ఆలోచించి ప్రబోధించి దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి.
సమాజంలో నిమ్న జాతులు, స్త్రీలు, కార్మికులు, కర్షకులు ఎలా దోపిడీకి గురవుతున్నారో ఎలా అణచివేయబడుతున్నారో చూసి వారికి ప్రతిఘటన మార్గం చూపాడు.
సమాజం వెలివేసిన వారి పిల్లలకు చదువు నేర్పాడు. అనాథ శిశువులను ఆదరించాడు. స్త్రీలకు విద్య నేర్పాడు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు.
బాల్యవివాహాలు, వితంతువులకు జుట్టు తీయించడం వంటి మూఢాచారాలను ఖండించాడు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బంక సంపత్ యాదవ్, మాజీ కార్పోరేటర్ నసీం జహాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వై భాస్కర్, నల్ల సత్యనారాయణ, ఇప్ప శ్రీకాంత్, నసీర్, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు బొంత సారంగం, మహమ్మద్ అజ్గర్, కృష్ణ, మాడిశెట్టి సతీష్, డివిజన్ అద్యక్షులు తక్కలపల్లి మనోహర్, జి. సంగీత్ కుమార్, బంక సతీష్ యాదవ్, వల్లపు రమేష్, బి. శ్రీధర్ యాదవ్, పోగుల సంతోష్, పాలడుగుల ఆంజనేయులు, సింగారపు రవి ప్రసాద్, షేక్ అజ్గర్, ఎల్లగొండ ప్రవీణ్, సంతోష్, నగర కాంగ్రెస్ నాయకులు మాడిశెట్టి సతీష్, మహిళా కాంగ్రెస్ నాయకులు కే.భారతి, అనిత, సుకన్య యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ జి. శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.