శనివారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు"మార్పుతో ముందడుగు"అన్న శీర్షికన కవి సమ్మేళనం
శనివారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు”మార్పుతో ముందడుగు”అన్న శీర్షికన కవి సమ్మేళనం
ఈ69న్యూస్ హన్మకొండ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆకాశవాణి వరంగల్ కేంద్రం”మార్పుతో ముందడుగు”అన్న శీర్షికన కవి సమ్మేళనం నిర్వహించిందని ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రోగ్రామ్ హెడ్ ఇల్లందుల రవికుమార్ తెలియజేశారు.ఈ కవి సమ్మేళనం శనివారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ప్రసారం చేయనున్నామని పేర్కొన్నారు.మహిళా సాధికారత కోసం,మహిళల్లో చైతన్యాన్ని కలిగించే దిశగా వివిధ రంగాలకు చెందిన మహిళలతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమాలను కూడా ఇదే శీర్షికతో ప్రతి బుధవారం శ్రోతలకి అందిస్తున్నామని,ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నదని ఈ సందర్భంగా రవికుమార్ వివరించారు.శనివారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ప్రసారం చేయనున్న కవిసమ్మేళనం లో 9 మంది కవయిత్రులు బాల బోయిన రమాదేవి,మాదారపు వాణిశ్రీ,దేవులపల్లి వాణి,సాగంటి మంజుల,అరుణ కీర్తి పతాక,రావుల కిరణ్మయి,మెరుగు అనురాధ,ముదిగొండ రమాదేవి,తాడూరి అరుణ తమ రచనలని వినిపిస్తారని,ఈ కార్యక్రమానికి అడవి రాజబాబు వ్యాఖ్యానంతో ప్రసారం అవుతుందని రవికుమార్ తెలిపారు.