
పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
దోమలపల్లి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన
గత 20 ఏళ్లుగా భూమి కొనుగోలు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిన ఇండ్లు నిరుపయోగంగా ఉన్నాయని వెంటనే పేదలకు పంపిణీ చేయాలని ఈ నెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున తెలిపారు. ఈరోజు నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం పదిహేళ్లుగా నిర్లక్ష్యానికి గురిచేసిందని పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయలేదని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కలగానే మిగిలిపోయాయని అన్నారు. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరం దాటినా కనీసం పేదల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదని విమర్శించారు కట్టిన ఇండ్లను కూడా పంపిణీ చేయలేని అసమర్ధ పాలకులుగా మారారని అన్నారు. నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రులు స్థానిక మంత్రి కనీసం ప్రజా సమస్యలపై పట్టించుకునే పరిస్థితులు లేవని తెలియజేశారు. ఎన్ని పర్యాయలు ప్రజలు విన్నవించిన ఉలుకు పలుకు లేదన్నారు. ఈనెల 24, 25 తేదీలలో మండల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పేదలతో కలిసి పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ స్పందించి మౌలిక సదుపాయాలు మంచినీరు మురికి కాలువలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నేటికీ అమలకు నోచుకోలేదని అన్నారు. వెంటనే సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు సత్యనారాయణ శాఖ కార్యదర్శి మేడి నరసింహ, కాసాని స్వామి, గాదే యాదయ్య, గాదె స్వామి తదితరులు పాల్గొన్నారు.