
43వ డివిజన్ లో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు
ఈ69న్యూస్ వరంగల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం 43 డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్ తో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ అరుణ మాట్లాడుతూ…మున్సిపల్ మహిళా కార్మికుల సేవలను కొనియాడుతూ మహిళలు అన్ని రంగాల్లో విప్లవాత్మక శక్తిగా ఎదగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రమ,భారత,లీలావతి,సుశీల,విజయ,కరుణ,ఎస్.ఐ వస్కులా కరుణాకర్ మరియు జవాన్లు ప్రశాంత్,శ్రీధర్,రవి,పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.