
ఈవీఎం స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య
ఈ69న్యూస్ హనుమకొండ
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో హనుమకొండ జిల్లాకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎంలు)భద్రపరచగా హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సోమవారం అధికారులు,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే త్రైమాసిక సాధారణ తనిఖీలలో భాగంగా ఈవీఎం స్ట్రాంగ్ రూములను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన భద్రత,సీసీ కెమెరాలు,రికార్డుల నిర్వహణ,తదితర రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.స్ట్రాంగ్ రూములలో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్,ఎన్నికల విభాగం నాయబ్ తహసిల్దార్ విఠలేశ్వర్,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవి శ్రీనివాస్ రావు,శ్యాంసుందర్,సయ్యద్ ఫైజల్లా,తదితరులు పాల్గొన్నారు.