
సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు
మీ దృష్టికి తీసుకువచ్చిన వారికి పెండింగ్ వేతనాలు ఇవ్వలేదు
ఈనెల 15 వరకు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం
సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ వర్కర్స్ ఐదు నెలల నుండి వేతనాలు పెండింగ్ లోఉన్నాయి ఎంసిఎచ్ హాస్పిటల్ వర్కర్స్ కు రెండు నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ఇప్పటికీ వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పస్తులుండాల్సిన పరిస్థితి ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయిన వేతనాలు ఇవ్వలేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు ఆవేదన వ్యక్తం చేశారు.మెడికల్ కాలేజీ హాస్టల్ వర్కర్స్ ఎం సి హెచ్ హాస్పిటల్ వర్కర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇప్పటికే కార్మికులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని యూనియన్ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లామని సంబంధిత కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టామని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత వేతనాలు వస్తాయని తెలిపినప్పటికీ వేతనాలు రాకపోవడంతో చాలిచాలని అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో రవాణా చార్జీలు లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.పది నెలల నుండి పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కార్మికుల అకౌంట్లలో జమ కాలేదని ఈ డబ్బులు ఎవరు కాజేశారని మండిపడ్డారు.వెంటనే పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు జమ చేయాలని అన్నారు.ఈ నెల 16న జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ కు ముఖ్యమంత్రి పర్యటన ఉన్నందున వారు వచ్చేలోపు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని లేకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు తెలిపారు.కాంట్రాక్టు వర్కర్స్ ను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం నెలకి 26,000 ఇవ్వాలని రెగ్యులర్ గా వేతనాలు నెలనెలా 5వ తేదీ లోపే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో తెలంగాణ ఎంసి హెచ్ &మెడికల్ కాలేజ్ హాస్టల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు రామ్ దయాకర్ ఏనుగుల రఘు జి అజయ్ స్వామి రూతు భారతి ప్రశాంత్ గోపాలకృష్ణ స్వప్న కవిత రజిత ఎల్లమ్మ బాలరాజు కర్ణాకర్ ఉప్పలయ్య సునీత స్వాతి సిద్ధులు సంపత్ తదితరులు పాల్గొన్నారు.