దీక్షా దివస్” నవంబర్ 29.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక మరిచిపోలేని రోజు!
Jangaon“ఆ మాటకొస్తే తెలంగాణ మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన రోజు. ఉద్యమ నేత కేసీఆర్ 2009 లొ ఇదే రోజున దీక్ష చేపట్టారు. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ త్యాగనిరతిని చాటుతూ ఆయన చేపట్టిన దీక్ష ప్రజల ఆకాంక్షల ముందు ఎంతటి వారైనా మోకరిల్లక తప్పదని నిరూపించింది. ఢిల్లీ సర్కారును కంపింపజేసింది.
అప్పటి వరకు సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి దీక్షా దివస్ కొత్త ఊపిరి ఇచ్చింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. కులాలు, మతాలు, పార్టీలు.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా యావత్ తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమించడానికి ప్రేరణ ఇచ్చింది. లాఠీలు, తూటాలు, భాష్పవాయుగోళాలు లెక్క చేయకుండా ఎంతటి నిర్బంధాన్నైనా నిలువరించే శక్తినిచ్చింది. చివరికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణను సాధించుకోవాలనే తెగింపును ఇచ్చింది.
ఈ సందర్భంగా మనం శ్రీకాంతాచారిని, ఇతరులను స్మరించుకుందాం!
ఒక్క సారి మనం కాలాన్ని వెనుకకు జరిపి చూస్తే….
కె సి ఆర్ గారి ఆమరణ నిరహార దీక్ష ….
ఆ మహా ఉగ్ర సత్యాగ్రహానికి భయపడి కేంద్రం దిగి రావడం జరిగింది!
డిసెంబరు తొమ్మిదినాడు తెలంగాణ రాష్ట్ర అనుకూల ప్రకటన జారీ చేసింది. దీన్నిఒప్పుకోని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలుగు దేశం పార్టీనేత చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రవర్తించాడు. తన శైలిలో పిచ్చి వ్యూహాన్ని రూపొందించాడు.
ఆ తరుణం లో అధికార కాంగ్రెస్ ద్వందనీతిని మోసాన్ని ఎండగట్టి మొదటి ఆమోదయోగ్యమయిన రాజీనామా అస్త్రం సంధించి చరిత్రాత్మక ఉప ఎన్నికలకు తెర లేపిన చాణుక్యుడు మన తాటికొండ రాజన్న!
వేలాది యోధుల ఆత్మబలిదానం…కె సి ఆర్ గారి ఆమరణ నిరాహారదీక్ష తెలంగాణా సాధనకు కీలకమయితే ..తెలంగాణ పోరాటంలొ సకలజనుల సమ్మె, 12 స్థానాలకు రెఫెరెండంలా 2010 ఉపన్నికలు ప్రధాన ఘట్టాలు..
ఆ ఉద్యమ ఘడియలలో కి అధికార పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఘన్పూర్ నియోజకవర్గంలొ తాటికొండ రాజయ్య సంచలన రాజీనామాతొ తిరిగి ఉప ఎన్నికలు జరిగాయి.
ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు రాజయ్యను యాభై వేలకుపైన మెజారిటి తొ గెలిపించి తమ అభిమానాన్ని చాటారు. మిగితా సీట్ల తో సహా ఘన్పూర్ లోను సీమాంధ్ర తొత్తులను ఓడించి మొట్టమొదటిసారి ఢిల్లీకి ప్రకంపనల సందేశాన్ని పంపారు మన తెలంగాణ ప్రజలు!
జై తెలంగాణ!
అమరవీరులకు జోహార్!!
ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి నాయకత్వం లొ కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుదాం!
ఈ ఉద్యమ చరిత్ర పుటలలో భాగమై వెలిగిన మన ఎమ్మెల్యే రాజన్న త్యాగం ఘన్పూర్ ప్రజల సాహస నిర్ణయాలూ చారిత్రిక మైన వీర జ్ఞాపికలే !
జై తెలంగాణా!
జై జై తెలంగాణా!!
జై రాజన్న!!!