
సుందర్ నగర్ లో సిసి రోడ్డు వెంటనే వేయాలి--
బన్సీలాల్ పేట్ డివిజన్ లో సుందర్ నగర్, కృష్ణానగర్ బస్తీల్లో నెలకొన్న సమస్యలైన సీసీ రోడ్డు ,కమిటీ హాల్, వీధిలైట్లు, వృద్ధాప్య, వీడో పెన్షన్స్ తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని సనత్ నగర్ జోన్ సిపిఎం పార్టీ కన్వీనర్ జి. నరేష్ తెలిపారు. బస్తీలో సర్వే సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని, పెరిగిన ధరలను నియంత్రించాలని, బస్తీలో సీసీ రోడ్డు ,కమిటీ హాల్, స్ట్రీట్ లైట్, వీడో, వృద్ధాప్య పెన్షన్స్ పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ సర్వే కార్యక్రమంలో పార్టీ నగర కమిటీ సభ్యులు N. మారన్న, జోన్ నాయకులు పి. మల్లేష్, పిఎన్ఎం నాయకులు రాము, బస్తి నాయకులు షాహిద్ తదితరులు పాల్గొన్నారు