
ప్రభావతి.జిల్లా కార్యదర్శి నల్గొండ.
భారతీయ ప్రజలు సంప్రదాయాల్లో అత్యంత ప్రత్యేకమైన హోలీ పండుగ ఈ నాడు దేశవ్యాప్తంగా హర్షాతిరేకంగా జరుపుకోనున్నారని తెలిపారు. రంగుల పండుగగా పేరుగాంచిన హోలీ, ప్రేమ, ఐక్యత, సౌహార్ద్రానికి ప్రతీకగా నిలుస్తుందని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో నల్గొండ మేకల అభినవ్ స్టేడియం వద్ద మహిళాలు అంతా కల్సి ఎంతో ఆనందంగా పరస్పరంరంగులు చలుకొని అట పాటలతో హోలీ వేడుకలు జరుపుకొన్నారు.
హోలీ వేడుకలు సాధారణంగా రెండు రోజుల పాటు జరుగుతాయి. తొలి రోజు హోలిక దహనం నిర్వహించి, మరుసటి రోజు ధూలెండీ లేదా రంగుల హోలీ నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రజలు పరస్పరం రంగులు చల్లుకుంటూ స్నేహాన్ని, ఆప్యాయతను వ్యక్తపరీఛారని తెలియజేశారు.
“హోలీ పండుగ మత, భేదభావాలను దాటి అందర్నీ ఒక్కటిగా చేర్చే ఒక అద్భుతమైన పర్వదినం. ఈ వేడుకలను సురక్షితంగా, ప్రేమతో జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఈ పండుగ మరింత ఆనందం, శాంతి, సంతోషాన్ని తేవాలని ఆకాంక్షిస్తూ, హోలీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ, జిల్లా కమిటీ సభ్యురాలు కనుకుంట్ల ఉమారాణి, బోల్లేపల్లి మంజుల, చిన్నపక మంజుల, కొండకింది సరితా, కంచర్ల మంజుల, కంచెర్ల అనిత, అజిత, సౌభాగ్య, లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.