
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండానే ఉద్యోగ ఫలితాలను విడుదల చేయుట ను వ్యతిరేకిస్తూ మండల అధ్యక్షులు,సోంపెల్లి అన్వేష్ మాదిగ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 6 వ రోజుకు చేరుకున్నాయి.ఈ దీక్షలో ముఖ్యఅతిథిగా ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస మాదిగ,మరియు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ లు పాల్గొని మాట్లాడారు.ప్రజాస్వామ్యబద్ధంగా మాదిగ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వ నియామకాలు ఫలితాలను నిలిపివేయాలని దీక్ష చేస్తున్న విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఇప్పటికైనా ఉద్యోగ నియామకా ఫలితాలను నిలిపివేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మాదిగలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేదంటే సిఎంను రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పుట్ట ప్రశాంత్ మాదిగ, విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు మాచర్ల బాబు మాదిగ,గంగారపు సుమన్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు,ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి చిలుక రాజు మాదిగ,గంగారపు ప్రకాష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల,నాయకులు
గంగారపు ప్రభుదేవ్ మాదిగ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
