తెలుగుగళం న్యూస్, శింగనమల. శింగనమల నియోజకవర్గ పరిధిలోని పేదలకు క్యాంపు కార్యాలయంలో రూ.27,12,600 రూపాయల సి.యం.ఆర్.ఎఫ్. చెక్కులు ను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న పేదలకు భరోసా ఇవ్వడం చాలా సంతోషమని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు. పేదలను ఆర్థికంగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ధన్యవాదాలు తెలిపారు