సంక్షేమ పథకాల అమలులో రాజీ పడేదే లేదు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం,జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. గత పాలకులు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారన్నారు. వరంగల్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఓరుగల్లుకు ఒక చరిత్ర ఉందని,అలాగే ఎందరో మహనీయుల పోరాటాల గడ్డ ఓరుగల్లు అని అన్నారు.హైదరాబాదుకు ధీటుగా రెండో నగరంగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తామని,ఇప్పటికే రూ. 6500 కోట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కేటాయించామని స్పష్టం చేశారు.ఈ మారుమూల ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గానికి ఇచ్చిన హామీ ప్రకారం రూ. 800 కోట్లను పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. అభివృద్దే లక్ష్యంగా ఈ ప్రభుత్వానికి ఆదర్శంగా నిలవాలన్నారు.అదే విధంగా వరంగల్ జిల్లాకు మామునూర్ విమానాశ్రయం,కాజీపేట రైల్వే కోచ్ ప్రత్యేక కృషి వల్ల వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.గత కాంగ్రెస్ పాలనలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్ లు చేపట్టి,లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామన్నారు.గత ప్రభుత్వం 8 లక్షల 29 వేల కోట్ల అప్పులు అప్పగించిందని, ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు.తెలంగాణ సాధనలో తొలి, మలి దశలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలతో రాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సర్ తెలంగాణ జాతిపితలుగా నిలుస్తారని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పాత్ర కీలకమని, అందుకే వరంగల్ అంటే నాకు ప్రత్యేక అభిమానమన్నారు.వరంగల్ ను హైదరాబాద్ కు పోటీపడేలా అభివృద్ధి చేస్తామన్నారు. రాంపూర్ డంపింగ్ యార్డు సమస్య త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం (1289) మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల మాఫీ కింద 92 కోట్ల 74 లక్షల చెక్కును పంపిణీ చేశారు. అలాగే బ్యాంకు లింకేజ్ కింద రూ. వంద కోట్ల చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు.అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన మంత్రులు, ప్రజాప్రతినిధులు,జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని శివునిపల్లి సభా ప్రాంగణం నుంచి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమం వేదిక వద్దకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ని ఘనంగా స్వాగతించారు.ఈ సందర్భంగా ఒగ్గు కళాకారుల నృత్యంతో, బంజారా కళాకారుల థింసాతో, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.అనంతరం ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం రాష్ట్ర గీతాలాపనలో పాల్గొని, సభనుద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క), ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి, పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్వినీ రెడ్డి, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్, వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు, ప్రజాప్రతినిధులు, జిల్లా, పోలీసు అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
