
ఈ69న్యూస్ జనగామ
గత బిఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాలే
నేటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ పర్యటనకు ఆదివారం వచ్చిన సందర్భంగా శనివారం అర్ధరాత్రి నుండి
పోలీస్ డిపార్ట్మెంట్
అధికారులు వచ్చి సిపిఎం జిల్లా నాయకులని ప్రజాసంఘాల నాయకులు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి సభ పెట్టుకోవడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కార్యదర్శి కనకా రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆయంలో కూడా ముఖ్యమంత్రి వచ్చిన మంత్రులు వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిన ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించి కార్యక్రమాలు నిర్వహించుకునేవారు.
అభివృద్ధి చేసినాము అందర్నీ ఆదుకున్నాము అని చెప్పిన ప్రభుత్వాలు పర్యటనకు వస్తే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ఎందుకని ప్రశ్నించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పద్ధతినివిమర్శించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం సభలకు అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వంఅదే పద్ధతిని అనుసరిస్తుందన్నారు ప్రజాస్వామ్యాన్ని అరించివేయాలన్నా ఏ ప్రభుత్వం కూడా మనగాడ లేకుండా పోయిందన్నారు
పోలీసు వారు కూడా అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి ప్రభుత్వ మెప్పు పొందాలని అనుకోవడం సరైనది కాదన్నారు.రాజ్యాంగం ప్రకారం సమస్యలపై నిరసన చెప్పే హక్కు ఉంటుందన్నారు దాన్ని మర్చిపోయి అరెస్టు చేయడం సరైన కాదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు అదే పద్ధతి పాటిస్తే రాబోయే కాలంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆర్ గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని కోరారు.