జన ప్రవాహంలా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు
ముఖ్యమంత్రి సభ భారీ సక్సెస్
సభను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు

ఈ69న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్
ప్రజా పాలన ప్రగతి బాటలో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని శివునిపల్లిలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చి సభను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు,మహిళలకు,యువకులకు,రైతులకు అన్ని వర్గాల ప్రజలకు ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.సభ నిర్వహణలో భాగస్వాములైన జిల్లా కలెక్టర్,అడిషనల్ కలెక్టర్లు,ఆర్డివోలు,ఇతర అధికార యంత్రాంగనికి,డీసీపీ,ఏసీపీలు పోలీస్ సిబ్బందికి,నియోజకవర్గ నాయకులకు,యువజన నాయకులకు,కార్యకర్తలకు,సభా ప్రాంగణంలో సేవలు అందించిన వాలింటర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 800కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ప్రోత్సహం,సహకారం,ప్రేమానురాగాలతో మున్ముందు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి,మరిన్ని ఎక్కువ నిధులు మంజూరు చేసుకోవడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తానన్నారు.స్టేషన్ ఘనపూర్ ప్రజల ఆధారాభిమానాలు ఎప్పటికీ మరువలేనని,ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటూ నన్ను ఆశీర్వదిస్తున్న నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.