ఈ69న్యూస్ వరంగల్

ఉమ్మడి వరంగల్ జిల్లా మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం సోమవారం ఖిలా వరంగల్ లోని దీపు కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన ప్రమాణ స్వీకారంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం అధ్యక్షుడు తాళ్లపల్లి మహేందర్ మాట్లాడుతూ… అందరిని కలుపుకొని పనిచేస్తూ యూనియన్ సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు.అలాగే యూనియన్ కు అడ్డా కోసం స్థలం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గందె ప్రభాకర్,ఉపాధ్యక్షులు ఆరే రాజు ప్రధాన కార్యదర్శి శబర్తి నరేష్ కోశాధికారి వంచ రంగారెడ్డి సహాయ కార్యదర్శి పోతుల రాజ కొమురయ్య కార్యవర్గ సభ్యులు ముట్టు బుచ్చన్న రావుల సురేందర్ ఎండి అహ్మద్ డైరీ ఎల్లయ్య బొల్లం కృష్ణ తాళ్లపల్లి సమ్మయ్య ఎర్రబెల్లి పురుషోత్తం రావు బండారి అమ్మన్న జక్కు సిద్ధులు సలహాదారులు కామ గోని రఘుపతి గౌడ్ పూజారి సంపత్ కుమార్ పడాల వీరన్న బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ చందర్లపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.