ఈ69న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులోని జిల్లా ఖజానా కార్యాలయం ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖజానా అధికారి ఆకవరం శ్రీనివాస్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.తలసేమియా బాధితుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో ఔత్సాహికులు, రక్త దాతలు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. రక్తదాతలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.మంగళవారం ఉదయం 9:30 గంటలకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారని డీటీవో శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు.