
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
కుల వివక్ష పై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కండి
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
మార్చి 19న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని, చేవెళ్ల ఎస్సి ఎస్టీ డిక్లరేషన్ అమలు కోసం బడ్జెట్ సరిపడు నిధులు కేటాయించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం నకిరేకల్ kvps భవన్ లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం( కెవిపిఎస్) నకిరేకల్, కేతేపల్లి, గౌరారం మండల స్థాయి సమావేశం సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వంటెపాక కృష్ణ అధ్యక్షతన జరిగింది .
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ల ఎస్సీ
ఎస్టీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా దళిత నిరుద్యోగులకు 12 లక్షల రూపాయలతో అంబేద్కర్ అభయహస్తంఇస్తామని ప్రకటించిందని ,దానికి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదన్నారు. ఆన్లైన్ లో కేవలం 3లక్ష లు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్ని రాష్ట్రప్రభుత్వం దరఖాస్తు చేయించడం అత్యంత దారుణమాని అన్నారు. 12లక్ష ల సంగతేంటి అని ప్రశ్నించార. ఏటా 750 కోట్ల రూపాయలు అంబేద్కర్ అభయస్థం స్కీముకు ఇస్తామన్న మాట నిలబెట్టుకో లేదన్నారు. దళితుల కోసం మూడు కార్పొరేషన్లు నియమిస్తామన్న మాట నీటిమూటలాగా మారిందన్నారు. ఇండస్ట్రీల్ ద్వారా రావాల్సిన్ని సబ్సిడీలు ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రము లో కుల దురహంకార హత్యలు పెట్రేగిపోతున్నాయని కులాంతర వివాహితుల రక్షణ చట్టం కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం చేయాలని కొరారు.
ఏప్రిల్ నెలలో మహనీయుల మాసంగా ప్రకటించుకుని పూలే అంబేద్కర్ జన జాతర నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మే అధికారికంగా ప్రతి గ్రామం పంచాయితీలో జయంతి సభలు నిర్వహించాలని తెలియజేశారు. ఏప్రిల్ మాసమంతాకుల వివక్ష అంటరానితనం పై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లా లో నేటికీ అనేక గ్రామాలలో దేవాలయ ప్రవేశం లేదని తెలిపారు. రాష్ట్రంలో నేటికీ హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి, కొన్ని గ్రామాలలో బతుకమ్మ ఆడనీయకపోవటం రచ్చబండల మీద కూర్చొనియ్యకపోవడం పట్టణ ప్రాంతాలలో దళితులకు ఇల్లు అద్దెకి ఇవ్వకపోవడం వంటి వివక్ష రూపాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ వివక్ష రూపాలపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలన్నారు
పూలే అంబేద్కర్ జన జాతరలు ఏప్రిల్ నెల మొత్తం నిర్వహిస్తామన్నారు. 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారంగా కుల వివక్ష ఉన్న గ్రామాలను గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రతినెలా నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లాసహాయ కార్యదర్శి వంటెపాక కృష్ణ జిల్లా కమిటీ వంగూరి వెంకన్న మండల కమిటీ సభ్యులు వంటెపాక నాగార్జున సైదులు జమాదాగ్ని, మర్రి ఎల్లయ్య, జోజి, యేసు,పెరిక మల్లయ్య,
బి ఎల్లయ్య నాగయ్య తదితరులు పాల్గొన్నారు.