
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్మ పున్నం
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామాలలో సర్వే
సర్వే బృందానికి సమస్యలు విన్నవించుకుంటున్న ఆదివాసీలు
త్రాగు నీరు, డ్రెయినేజీ, పోడు పట్టా బూములలో బోర్లు, పోడు పట్టా లో తప్పులను, కరెంట్ సమస్యలను పరిష్కరించాలి
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్మ పున్నం
కోటపల్లి మండలంలోని లింగన్నపేట గ్రామంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ లింగన్నపేట గ్రామం లో ముఖ్యంగా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇక్కడి గ్రామస్తులందరూ ఓకే పంపవద్ద నుండి త్రాగునీరు తెచ్చుకుంటారు, ఆదివాసి కాలనీలో ఉన్నటువంటి బావి మరియు చేతి పంపు లలో నీరు ఎండిపోయాయి, కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు, త్రాగునీటి కోసం ఊరంతాటికీ ఒకే చేతి పంపు ఉండడం వలన ప్రజలు గంటలు తరబడి లైన్లో నిలబడి త్రాగు నిరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే త్రాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు ఒక బోరు వేయించాలని mla వివేక్ గారికి చాలాసార్లు విన్నవించుకున్నపటికి వేయిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు వేయించక పోవడం తో నీటి ఎద్దడి ఎక్కువవుతుందని ప్రజలు వాపోయారు, పోడు పట్టాలలో ఉన్న తప్పులను సవరించాలని, పోడు పట్టా భూములలో బోర్వెల్ మంజూరు, మెయిన్ రోడ్డు నుండి ఆదివాసి కాలనీలో కి కరెంట్ లైన్, ఆదివాసి కాలనీలో డ్రైనేజీ, ల సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు లేని యెడల నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. భాగాల అశోక్, అత్రం చిన్నన్న, రెడ్డి చిన్నన్న, నాయిని బిమయ్య, నాయిని తారా, భాగాల సమ్మయ్య, కర్పేత పొట్టి లు పాల్గొన్నారు.