
మోకు కనక రెడ్డి సిపిఎం జనగాం జిల్లా కార్యదర్శి
జనగామ–మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా
ఇంటి నెంబర్లు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం డిమాండ్
మోకు కనక రెడ్డి సిపిఎం జనగాం జిల్లా కార్యదర్శి
జనగామ పట్టణంలోని మూడో విడత ఇందిరమ్మ ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని మంగళవారం జనగామ మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో జోగు ప్రకాష్ సిపిఎం జనగాం పట్టణ కార్యదర్శి అధ్యక్ష వహించగా ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా జనగామ జిల్లా సిపిఎం కార్యదర్శి మోకు కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 2012-2013 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం జనగామ పట్టణంలోని ఇండ్లు లేని వారందరికీ శామీర్పేట గ్రామ శివారులో 1144 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ వాటికి స్థలాలు చూపించలేదు. సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించి అధికారుల ద్వారా స్థలాలను లేఔట్ చేయించి ప్రజలకు ఇప్పివ్వడం జరిగింది. ఆ స్థలంలో పేదలు తమకు కలిగేదాంట్లో ఒక్కొక్క రూము వేసుకున్నారు . కానీ వాటికి ఇంటి నెంబర్లు వేయమని అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించడం అయినా ఫలితం లేదు ఇప్పుడు జనగామ కమిషనర్ నరసింహులు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ..ఈ సందర్భంగా ఇంటి నెంబర్లు ఏప్రిల్ మొదటి వారంలో నెంబర్లు వేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నెంబర్లు వేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు రూపకల్పన చేసి పాలనను ఎండా కడతామని వారు హెచ్చరించారు. ఇండ్లు నిర్మించుకున్న వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లోను ఇచ్చి మౌలిక వసతులు మంచినీరు కరెంటు రోడ్లు సౌకర్యాలు కల్పించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈర్రి అహల్య బొట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి బిట్ల గణేష్ పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం నాయకులు ఎండి గౌసియా సౌందర్య ధరావత్ మహేందర్ మీత్య నాయక్ సురేష్ సుధాకర్ వెంకటేష్ ఉపేందర్ బాలస్వామి రజిత జయ సంతోష గంగా కౌర్ మల్లమ్మ పద్మ రేణుక రహిమ విజయలక్ష్మి అమల శైలజ కమల బాబురావు రాములు అభేద పరమేశ్వరి ఇందిరా బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.