E69news హనుమకొండ
పంపు హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇక్కడి వచ్చాం
రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులో దేవాదుల పంప్ హౌస్ మోటార్ల ప్రారంభోత్సవానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వచ్చిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి

దేవాదుల ఫేజ్ 1,2,3లను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాగునీటి పారుదల,ఆయకట్టు అభివృద్ధి,ఆహార,పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులోని జె. చొక్కా రావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-3, ప్యాకేజ్ -3 భాగంగా నూతనంగా నిర్మించిన దేవన్నపేట పంప్ హౌస్ మోటార్లను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా పంప్ హౌస్ లోని మోటార్లను రాష్ట్ర మంత్రులు,ఉన్నతాధికారులు పరిశీలించారు.దేవాదుల పంప్ హౌస్ కు సంబంధించిన ఫేజ్ 1, 2, 3లకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు,అధికారులతో సమీక్షించారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సాగునీటిపారుదల,ఆయకట్టు అభివృద్ధి,ఆహార,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు ఫేజ్ 3 కింద పంప్ హౌస్ పనుల పురోగతిపై సమీక్ష,పంపు హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.వాస్తవానికి పంపు హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ ప్రారంభ కార్యక్రమం బుధవారం జరగాల్సి ఉందన్నారు.అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం,కేబినేట్ సమావేశాలు బుధవారం ఉండటంతో పంపు హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు.ఎంత రాత్రి అయినా మోటార్ల స్విచ్ ఆన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమౌతా మన్నారు.దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఫేజ్ 1,2,3లను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తాను ఇటీవల కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ని కలిసినట్లు చెప్పారు.దేవాదుల లాంటి ప్రాజెక్టులకు బ్యాలెన్స్ ఫండ్ ను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో సరైన విధంగా డాక్యుమెంటేషన్ అసంపూర్తిగా ఉందన్నారు.డాక్యుమెంటేషన్ పూర్తి చేసి బ్యాలెన్స్ ఫండ్‌ను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దోహదపడుతుంద న్నారు.దేవాదుల ఆయకట్టు కింద వివిధ కారణాల చేత సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్న సమాచారం తమకు అందడంతో ఇక్కడికి ఇంత తొందరగా రావాల్సి వచ్చింది అన్నారు.పంటల సాగులో రైతులను తప్పనిసరిగా ఆదుకోవాలని ఉద్దేశంతో ఇక్కడి పంప్ హౌస్ ఆన్ చేయడం ద్వారా నీటిని అందించేందుకు వచ్చామన్నారు.అందుకే ఇక్కడికి వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించి స్విచ్ ఆన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి మంగళవారం రోజు వచ్చామన్నారు.సాగునీటిపారుదల,సంబంధిత కంపెనీ అధికారులను సమన్వయం చేసి ఎంత రాత్రి అయినా స్విచ్ ఆన్ అయిన తర్వాతనే హైదరాబాద్ కు తిరిగి వెళ్తామన్నారు.ఇక్కడి పంపు హౌస్ లోని ఒక్క పంపును ఆన్ చేయడం ద్వారా స్టేషన్ ఘనపూర్,పాలకుర్తి,జనగామ,కొంత భాగం వర్ధన్నపేట నియోజకవర్గాలలోని పంటలకు సాగునీరు అందించవచ్చన్నారు.క్షేత్రస్థాయిలో ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రత్యక్షంగా సమీక్షించేందుకు వచ్చినట్లు చెప్పారు. పరోక్షంగా చలి వాగు నీరు వదిలేయడానికి, పరకాల భూపాల్ పల్లి కి వదిలేయడానికి దోహదపడుతుందన్నారు.ఈ పంపును ఆన్ చేయడంలో సమస్య ఎదురయిందన్నారు.ఈ పంపును ఆన్ చేయడం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను ఆదుకోవడం కోసం చర్యలు తీసుకునేందుకే ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు.ఈ పంప్ హౌస్ ద్వారా ప్రత్యక్షంగా స్టేషన్గన్పూర్,పాలకుర్తి జనగామ,పరోక్షంగా పరకాల భూపాల్ పల్లి, కొంత వర్ధన్నపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ఇక్కడికి వచ్చామన్నారు.దేవాదుల ప్రాజెక్టు గత పదేళ్లుగా ఎందుకు పూర్తి కాలేదనే విషయం అందరికీ తెలుసునని అన్నారు.దేవాదుల ఫేజ్ 1,2,3ని పూర్తిగా సమీక్షించి హైదరాబాద్ నుండి వచ్చినట్లు పేర్కొన్నారు.అవసరమైన నిధులను కేటాయించి అన్ని ఫేజ్ లను పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ తో చర్చించబోతున్నట్లు తెలిపారు.రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..దేవాదులకు ప్రాజెక్టును దివంగత రాజశేఖరరెడ్డి 2004లో చుట్టారని అన్నారు.చుట్టారని.జల యజ్ఞంలో భాగంగా ఆనాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరి నీటితో ఈ ప్రాంతాన్ని సశేషంలను చేసేందుకు వాదుల ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.దేవాదుల ఫేజ్ 1 లో లక్షా నాలుగు వేల ఎకరాలు,ఫేస్ టూ 1,50,000 ఎకరాలు,పేజ్ 3లో మూడు లక్షల 50 వేల ఎకరాలు లక్ష్యంగా శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫేజ్1 పూర్తయింది అన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి,రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉన్న అయంలో ఫేజ్ 2 పనులు ప్రారంభమయ్యాయి అని అన్నారు.విభజన తర్వాత దేవాదులు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యమైందన్నారు.ఏఐబీపీలో చేర్చిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కిందన్నారు.ఇందిరమ్మ ప్రభుత్వ హయంలోనే ఫేస్ త్రీ ని ప్రారంభించుకున్నామని అన్నారు.మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం హయాంలోనే పేజ్ 3 పూర్తి చేయబోతున్నట్లు చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధి,కార్యదీక్ష ఎలా ఉంటుందో స్పష్టంగా చూస్తున్నారని అన్నారు.గత ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులపైనే పెట్టారని అన్నారు.ఉమ్మడి జిల్లా తో పాటు సూర్యాపేట,సిద్దిపేటలను ఆయకట్టు ద్వారా కొద్ది వాటి నిధులతో అద్భుతమైన ఈ కార్యక్రమం పూర్తి చేయవచ్చనే ఆలోచన లేని కారణంగా దేవాదుల ప్రాజెక్ట్ ఆలస్యమైందన్నారు.గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందన్నారు.ప్రతి రెండు నెలలకు ఒకసారి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమీక్షిస్తున్నారని చెప్పారు.అనుకున్న ఆయకట్టు కంటే రైతులు ఎక్కువగా సాగు చేయడం వలన రెండో పంట సాగుకు రైతులకు నీటి ఇబ్బందుల్లో కలుగుతున్నాయని అన్నారు.ఎట్టి పరిస్థితులోనూ దేవాదుల ఫేజ్ 3 పంప్ హౌస్ ద్వారా నీరును అందించినట్లయితే 70వేల ఆయకట్టు పంటలను సురక్షితం చేయవచ్చని యుద్ధ ప్రాతిపదికన పంప్ హౌస్ మోటార్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.రైతులకు ఇబ్బంది కలగకుండా నీళ్లు అందించాలనే ఉద్దేశంతోనే బడ్జెట్ సమావేశాలు ఉన్నా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.ముందు రైతు శ్రేయ సు ముఖ్యమైన ఉద్దేశంతో దేవదూల మూడు ఫేస్ భారత్ మోటర్లను ఆనాటి ప్రభుత్వం అనాలోచితం నిర్ణయాల వలన దేవాదుల ప్రాజెక్ట్ పై నిర్లక్ష్యం జరిగిందన్నారు.గత ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగానే తాగునీరు సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి తాగునీటి సమస్యలు తలెత్తడానికి గత ప్రభుత్వ నిర్వాహమేనని అన్నారు.స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ..దేవాదుల పంప్ హౌస్ మోటార్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డిలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు,రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.చివరి ఆయకట్టు వరకు వరకు పంటలను కాపాడాలని ఆలోచనతో దేవాదుల పంప్ హౌస్ మోటార్ల ప్రారంభోత్సవం చేశారని,ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి,రాష్ట్ర సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి,కుడా చైర్మన్ ఇనగల వెంకట్రాంరెడ్డి సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,జి డబుల్ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే,దేవాదుల,సాగునీటి పారుదల,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.