స్థానిక సంస్థలు మరియు విద్యా ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్ లు 42 శాతం ఇవ్వడానికి రాష్ట్ర శాసనసభలో ఆమోదం తెలపడాన్ని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ హర్షం వ్యక్తం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఢిల్లీ తీసుకు వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.
అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని బిజెపి ఎంపీలు, మంత్రులు అందుకు చొరవ చూపాలి. బీసీలకు విద్యా ఉద్యోగాలలో కల్పించిన విధంగా స్థానిక సంస్థలలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం.
గుమ్మడి రాజు నరేష్, కన్వీనర్
గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ,
చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ.