
ఈ69న్యూస్ జఫర్ఘడ్
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉండి పదవ తరగతి పరీక్షలు రాయాలని తమ్మడపల్లి -జి ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతారామయ్య సూచించారు.బుధవారం జడ్పీహెచ్ ఎస్ తమ్మడపల్లి -జీ ఉన్నతపాఠశాలలో 9వ.తరగతి విద్యార్థులు 10వ.తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు
వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా హెచ్ ఎం మాట్లాడుతూ..ఈ నెల 21 నుండి జరుగబోయే పరీక్షలను విద్యార్థులు బాగా రాయాలని,జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే 10వ.తరగతి పరీక్షలు మొదటి అడుగు అని వివరించారు.పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని,రోజు 15 నిమిషములు ధ్యానం చేయాలని కోరారు.పరీక్షలపై పలు సూచనలను,సలహాలను ఉపాధ్యాయులు విద్యార్దులకు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా
10వ.తరగతి విద్యార్థిని విద్యార్థులు పాఠశాలతో గల తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కనీళ్ళపర్యంతమయ్యారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవరావు,ఆరోగ్యరెడ్డి, సంపత్ కుమార్,సురేష్,రవీందర్ రెడ్డి,ఉమామహేశ్వరీ,శ్రీధర్ పాల్గొన్నారు.