
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్
డివైఎఫ్ఐ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రవీంద్రనాయక్ నగర్ కాలనీలో స్ట్రీట్ లైట్లు పోల్స్ ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్ మాట్లాడుతూ… ప్రస్తుత ప్రస్తుతం పరిస్థితుల్లో యువకులు సెల్ ఫోన్లలో సోషల్ మీడియాలో టైం కేటాయించడం వల్ల మానసికంగా బెట్టింగ్ యాప్ లో మోసపోతున్నారు వాటితో పాటు అనేక ఒత్తిడిలకు గురి అవుతున్నారు. మానసికంగా ఇబ్బంది లేకుండా ప్లే గ్రౌండ్లో స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపాలని స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని యువకులకు క్రీడల్లో ఉత్సాహంగా ఉన్నవారికి ప్లేగ్రౌండ్స్ లో సౌకర్యాల కోసం డివైఎఫ్ఐ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో రవీంద్ర నాయక్ నగర్ కాలనీ యువకులు రాజా, శ్రీకాంత్ డాక్టర్ బాబు , నవీన్, బీచ్యా శ్రీనాయక్, దీపక్, సాయి మురళి తదితరులు పాల్గొన్నారు