
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డెకరేషన్ లో సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని వెంటనే అమలు చేసి జనగామకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గౌడ ఐక్య సాధన సమితి గౌడ కల్లుగీత కార్మిక సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ధర్నాకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నదని నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొని ఆసంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..జనగామ అంటేనే పోరాటం చైతన్యం దిక్కారస్వరమని జనగామ ప్రాంతానికి తెగువ తెగింపును 350 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న చూపించాడని సామాన్య గౌడ కుటుంబంలో పుట్టి తన తోటి పీడనకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలను నిమ్నజాతులను కలుపుకొని ఈ ఏకకాలంలో నైజాము నవాబును ఢిల్లీ సుల్తాను ఎదిరించి పోరాడి గోల్కొండ కోటను ఏలిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని తెలిపారు ఇంత గొప్ప చరిత్ర ఉన్న యోధుని పేరుమీద జిల్లా పేరు పెట్టడం సమంజసమని భవిష్యత్ తరాలకు బాపన్న గురించి తెలిసే అవకాశం విస్తృతంగా ఉంటుంది.వెంటనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు జనగామను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అలాగే గీత కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత ఆర్థిక భరోసా కల్పించి వృత్తిదారులందరికీ సేఫ్టీ మోకులు పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియోలకు నిధులు విడుదల చేయాలి అందుకోసం కల్లుగీత వృత్తికి ఈబడ్జెట్ సమావేశాలలో ఐదు వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన మద్దతు ప్రకటించారు.ఈకార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు భీమగోని చంద్రయ్య జనగామ జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు కంకటి రాజయ్య కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్ జిల్లా ఉపాధ్యక్షులు జొన్నగోని శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు మార్క ఉపేందర్ బాల్నే రాజయ్య బస్వాగాని మహేందర్ సమ్మయ్య ఉప్పునూతల అయోధ్య వడ్లకొండ వెంకటేష్ బండపల్లి శంకరయ్య బుర్ర లక్ష్మీనారాయణ యాదాండ్ల పరంధాములు ఉమాపతి రావుల శ్రీనివాస్ అంబాల శ్రీనివాస్ బోయిని రమేష్ ఎడ్ల వసంత్ బెజ్జం అశోక్ తదితరులు పాల్గొన్నారు.