
ఈ69న్యూస్ జఫర్ఘడ్
ప్రపంచ నీటి దినోత్సవం లో భాగంగా బాలవికాస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం రఘునాథ్ పల్లి గ్రామంలోని పాఠశాలలో జల దినోత్సవం వేడుక నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా గ్రామంలో విద్యార్థులు,గ్రామస్తులచే ర్యాలీ నిర్వహించి,జల సంరక్షణ కొరకు ప్రతిజ్ఞ చేయించి,అనంతరం హిమానదాలు-సంరక్షణ అనే అంశం పై పాఠశాల విద్యార్థులకు చిత్ర లెకణం,వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,బాల వికాస ప్రతినిధులు అనిత,స్వప్న,బాలవికాస వాటర్ ప్లాంట్ సభ్యులు,అంగన్వాడీ కార్యకర్తలు,యువకులు,మహిళలు,పాల్గొన్నారు.
