సీపీఐ జిల్లా కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి

దేవాదుల వరద కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు నీరందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి అన్నారు.జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం ముక్తుంతండా నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల కమిటి ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రకి రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పాదయాత్ర ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీటిని ఇస్తాం చివరి ఆయ కట్ట వరకు సాగునీటిని అందిస్తామని రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి వరద కాలువలను మరిచారన్నారు.కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటదని అనుకుంటే మెట్ట ప్రాంతమైనా జనగామ జిల్లాకు మొండి చేయి చూపడం తప్పా పరిష్కరించబడింది లేదన్నారు.దేవాదుల వరద కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు నిరందించడంలో విఫలమైందని ఆరోపించారు.మండలంలోని ఉప్పుగళ్ళు రిజర్వాయర్ సామర్థ్యం 0.39 టీంసీలు దాని ద్వారా 7500ఎకరాలకు సాగునీరు అందించొచ్చు కానీ అందించడంలో ఘోరంగా విఫలమయ్అయారన్నారు.భూగర్భ జలాలు అడుగంటిపోయి చెరువులు కుంటలు మొత్తానికి ఎండి పోయినై కనీసం వేసినా పంట చేతికి అందకుండా ఎండిపోయినాయి ఎండిన పంటలకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడి ఉప్పుగళ్ళు నుండి పాలకుర్తికి పోయే వరద కాలువ నిర్మాణ పనులు సత్వర్వమే నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీటిని సకాలంలో అందించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయపడాతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యదర్శి జువారి.రమేష్,జిల్లా నాయకులు అది సాయన్నా,ఆకుల శ్రీనివాస్,సోమయ్య,రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శి యాకుబ్ పాషా పెండ్యాల సమ్మయ్య,బికెఎంయు జిల్లా అధ్యక్షులు మండల గట్టుమల్లు కురపాటి చంద్రమౌళి అన్నెపు అజయ్ మంద బుచ్చయ్య కుక్కల శోభా జువారి.భద్రమ్మ అరుణ,డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కలకోట.ప్రభాకర్ యువజన సంఘం నాయకులు ఏ విష్ణు గడ్డి పెద్దరాజు ఎర్రం సతీష్ మోడెం శంకర్ తదితరులు పాల్గొన్నారు.