
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను గురించి పోలీసులు అవగాహనా సదస్సు నిర్వహించారు.గత రెండు రోజుల క్రితం తాటికొండ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగిందని దాన్ని దృష్టిలో పెట్టుకుని వారి పిల్లలపై దృష్టి సారించాలని తల్లి దండ్రులకు సూచించారు.ఎవరిమీద నైనా అనుమానం అనిపిస్తే ఘనపూర్ పోలిస్ వారికీ తెలియజేయాలని సిఐ వేణు తెలిపారు.