అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించిన శ్రీ సాయి విజ్ఞాన భారతీయ హై స్కూల్, వరంగల్ విద్యార్థులు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని శ్రీ సాయి విజ్ఞాన భారతి హై స్కూల్, వరంగల్ నందు విద్యార్థులే డాక్టర్లుగా మారి వైద్య పరీక్షలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సామల శశిధర్ రెడ్డి తెలిపారు విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్క విషయంపై అవగాహన కలిగేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ డాక్టర్ల దినోత్సవం నిర్వహించినట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు సమాజంలో డాక్టర్ల పాత్ర ఎంతో ముఖ్యమని మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత డాక్టర్లే మనకు దేవుళ్ళుగా పరిగణిస్తూ వారి సేవలను కొనియాడే విధంగా ఈరోజు మనమంతా డాక్టర్లకు ఎంతో రుణపడి ఉంటామని వారి సేవలను గుర్తించుకొని వారికి ఒక దైవముల పూజించే అవకాశం మనకు దొరికిన ఈ రోజును ఎంతో గొప్పగా ఘనంగా నిర్వహించాలని మా విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని శశిధర్ రెడ్డి తెలిపారు వచ్చే సంవత్సరం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ యొక్క డాక్టర్ల దినోత్సవం ఊరు వాడల రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు భారతదేశ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ముస్కురోజా శ్రీకాంత్ రెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు