
DYFI
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి.
హనుమకొండ: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సెలవు రోజు కూడా పాఠశాలను నిర్వహిస్తున్న హనుమకొండ నక్కలగుట్ట లోని శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి తో కలసి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో అబ్దుల్ హై కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలకు ఆట స్థలము, ఫైర్ సేఫ్టీ విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ లేకుండా , అధిక సంఖ్యలో విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకుని పాఠశాల భవనం రెండవ అంతస్తులో రేకుల షెడ్డులు ఏర్పాటు చేసి వాటిలో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఐ పి ఎల్,ఎన్ పి ఎల్ కోచింగ్ పేరుతో విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తు, ఒకేసారి మిగతా సంవత్సరాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను కొనాలని విద్యార్థులను, తల్లిదండ్రులను పాఠశాల యజమాన్యం ఒత్తిడి చేసి అధిక ఫీజులకు మెటీరియల్ ను అమ్ముతున్నారని తెలిపారు. విద్యార్థుల నుండి ఆన్లైన్ పరీక్షల పేరిట అదనపు ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారన్నారు విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ఫీజులు చెల్లించాలని విద్యార్థులను మానసికంగా వేధిస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సి బ్యాచ్ పేరిట నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్ కి ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకున్నా, సెంచరీ పాఠశాలలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం తరగతులను నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పెడుతున్న జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలో శ్రీ చైతన్య పాఠశాల ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. విద్య పేరుతో కార్పొరేట్ హంగులు సృష్టించి,విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులను వసూలు చేస్తూ మోసం చేస్తున్న శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డి వై ఎఫ్ ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు…