కేఎల్ నరసింహారావు 21వ వర్ధంతి
Jayashankar Bhupalpally, Suryapetసూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో కీర్తిశేషులు కేఎల్ నరసింహారావు గారి 21 వ వర్ధంతి గ్రామ వెలుగు నాట్యమండలి మరియు కేఎల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వెలుగు నాట్యమండలి అధ్యక్షులు పొనుగోటి రంగా పాల్గొని కేఎల్ నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం వారు మాట్లాడుతూ కే ఎల్ నరసింహారావు రేపాల గ్రామంలో జన్మించడం రేపాల ప్రాంతానికి గర్వకారణమని కె.ఎల్ నరసింహారావు 22. 7. 2003లో మరణించినారు. నేటికీ వారు మరణించి 21 సంవత్సరాలు అయినది. వారు తెలంగాణ తొలి మాండలిక భాషలో అనేక రచనలు చేసినారు. 1946లో గ్రామ వెలుగు నాట్యమండలి ని వారు స్థాపించినారు. అప్పటినుండి గ్రామంలో ఈరోజు వరకు కూడా గ్రామ వెలుగు నాట్య మండలిలో వందలాది మంది కళాకారులను తయారు చేసినారు. ఇప్పటి వరకు కూడా రేపాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో గ్రామ వెలుగు నాట్యమండలి పాత్ర చాలా ముఖ్యమైనది. వారు ఉత్సవాలకు నాట్యమండలి తరఫున కూడా నాటకాలు వేయటం జరుగుతుంది. అప్పట్లో రేపాల గ్రామానికి కరెంటు తీసుకురావడంలో ప్రథమ పాత్ర పోషించినారు. తెలంగాణ సాయుధ పోరాటంలో విప్లవ శంఖం అనే నాటిక ప్రదర్శన తెలంగాణ లో అన్ని జిల్లాలలో రేపాల గ్రామం నుండి కళాకారులు వెళ్లి, గ్రామ వెలుగు నాట్యమండలి పక్షాన ఊరుర ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శన కెఎల్ నరసింహారావు కు చాలా గొప్ప పేరు రావడం జరిగింది. అన్నారు. కార్యక్రమంలో కేఎల్ మెమోరియల్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి పందిరి పుల్లారెడ్డి, వృద్ధ కళాకారులు గవిని కోటయ్య, మాచర్ల రామయ్య, సారిక లింగయ్య, గండు నారాయణ, సొంటె పరుశరాములు, బత్తుల నరసయ్య, జూనియర్ కళాకారులు గవిని పెద్ద లక్ష్మీనరసింహం,తోకల సైదులు, కుంటి గొర్ల వెంకటేశ్వర్లు, సారిక పెదరామయ్య, రావులపెంట రాజబాబు, గండు హనుమంతు, పాముల రాఘవేందర్, జంపాల సైదులు, పల్లి జానారెడ్డి, రావు జానకమ్మ, తదితరులు పాల్గొన్నారు.