_ దుర్గం కళావతి అసోసియేషన్ జిల్లా గౌరవ అద్యక్షురాలు.
రాష్ట్ర ప్రభుత్వం kgbv నాన్ టీచింగ్ వర్కర్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని తెలంగాణ ప్రగతిశీల KGBV నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్(IFTU) జిల్లా గౌరవ అద్యక్షురాలు దుర్గం కళావతి అన్నారు.అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అర్బన్ KGBV లో అసోసియేషన్ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దుర్గం కళావతి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నారని అయిన కేసీఅర్ వారి వేతనాల పెంపుదల,పర్మినెంట్ చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు.కేసీఅర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దేశానికే దిక్సూచిగా తెలంగాణ ప్రభత్వం ఉందని చెప్పి మరి kgbv లలో కనీస వేతనాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.ఇతర రాష్ట్రాలలో kgbv లలో వేతనాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. బంగారు తెలంగాణలో కనీసం వర్కర్స్ కు గుర్తింపు కార్డులు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చెప్పి మోసం చేస్తే, ఒడిశాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 57 వేల మందిని క్రమబద్ధీకరణ చేసిందన్నారు. ఆ విధంగా తెలంగాణలో ఎందుకు క్రమబద్ధీకరణ చేయరని దుయ్యబట్టారు. కేజీబీవీ లలో వంట వర్కర్స్, స్విపర్, స్కావెంజర్లకు రక్షణ పరికరాలు ఇవ్వాలని, anm లకు వారంలో మూడు నైట్ డ్యూటీలను రద్దుచేసి రోస్టర్ పద్ధతిలో అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రతి స్కూల్ కి ఫైర్ సెఫ్టిని,వెహికిల్ ను ఏర్పాటు చేయాలని, కేర్ టేకర్ నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధమ మహాసభలను ఈనెల 11న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు దీనికి వర్కర్స్ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు లక్ష్మీ, పుష్ప,శ్రీవేని,సువిద,జ్యోతి తదితరులు పాల్గొన్నారు