KR లత నర్సరీ అధికారుల పాత్రల పై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
Jangaonఆయిల్ష్పామ్ మొక్కల అక్రమ రవాణా కు పాల్పడుతున్న నర్సరీ కాంట్రాక్టర్లు సంబంధిత హార్టికల్చర్ జిల్లా అధికారి KR లత నర్సరీ అధికారుల పాత్రల పై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
–తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్
జనగామ: ఆయిల్ష్పామ్ మొక్కల అక్రమ రవాణా కు పాల్పడుతున్న నర్సరీ కాంట్రాక్టర్లు రఘురాం రెడ్డి, సంబంధిత అధికారుల పై క్రిమినల్ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ ఒక ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ……
జనగామ మండలం ఎల్లంల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నర్సరీలో సుమారు 10లక్షల మొక్కల పెంచుతున్నారని, ఈ ఒక్కొక్క మొక్కకు ప్రభుత్వం 23 రూపాయలు వెచ్చించి ప్రభుత్వం కాంట్రాక్టర్ కు కట్టి ఇస్తుందని సుమారు 23కోట్ల రూపాయలు ఇస్తుందని అన్నారు.నర్సరీ కాంట్రాక్టర్లు, నర్సరీ అధికారికి తెలవకుండా మొక్కల ఎలా బయటికి వెళుతాయని ప్రశ్నించారు. మొక్కల తరలింపులో జిల్లా హార్టికల్చర్ అధికారులు కనుసన్నల్లో జరుగుతుందని, మొక్కను ప్రయివేటుగా కొనుగోలు చేయాలంటే ఒక్కొక్క మొక్కకు 200 రూపాయలు ఉందని,కాబట్టి దొడ్డిదారిన తలించి అక్రమంగా సంపదను ఆర్జిస్తున్నారని,జనగామ జిల్లా పరిధిలోని రైతులకు కేవలం 20 రూపాయలకు ఇస్తున్నారని,జిల్లాలోని రైతులు ఆలోచించాలని అన్నారు.
సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామా నికి చెందిన కిన్నెర రాంబాబు పేరునఒక్క గజం భూమి లేకున్నా సుమారు 750 మొక్కలు ఎలా తరలించారు. మొక్కల లోడుతో వెళ్తున్న లారీ సిద్దారం గ్రామానికి కాకుండా ఆంధ్రా వైపు వెళ్తున్న విషయాన్ని గుర్తించిన రైతులు తెలం గాణ-ఆంధ్రా సరిహద్దులోని మేడిశెట్టివారిపాలెం ఏరియాలో అడ్డుకున్నారు. ఏపీలోని జంగారెడ్డిగూ డెం మండలం పంగిడికి అక్రమంగా తరలిస్తున్నట్లు రైతులు అనుమానం వ్యక్తం చేశారు. రైతలు ఫిర్యాదు మేరకు లారీతోపాటు మొక్కలను స్వాధీనం చేసుకున్న సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆయిల్షామ్ నర్సరీలో సబ్సిడీపై మొక్కలు కొను గోలు చేసి మధ్యవర్తి ద్వారా ఎక్కువ ధరకు ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్నట్లు అక్కడి రైతులు పోలీసు లకు వివరించారు. కావున చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు