
SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం జనగామ: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ జనగామ నియోజక వర్గంలో చేసిన అభివృద్ది ఏమిటి అని SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం ప్రశ్నిOచారు… జనగామ మండల కమిటీ సమవేశానికి జనగామ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 2015,2021 మూడు జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పల్ల రాజశేఖర్ రెడ్డి గారు అటు పట్ట భద్రులను ఇటు నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు వారి ఓట్లతో గెలిచి సమస్యలు పరిష్కారం చూపకుండా ప్రగతి భవనంలో పరిమితం అయ్యారని మండిపడ్డారు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని కనీసం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావన కూడా తీసుకురాకుండా ఉంటారని అన్నారు 2021 ఎన్నికలో ఎమ్మెల్సీ గా గెలిచి జనగామ నియోజక వర్గంలో ఉన్న ఓబుల్ కేశవపూర్ గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం కొరకు 5 లక్షల రూపాయలతో CC రోడ్డు నిర్మించినారు అని అన్నారు కేవలం ఒకే గ్రామానికి 5 లక్షలు అభివృద్ధి చేయడం సిగ్గు చేటని అన్నారు ఎమ్మెల్సీ గా జనగామ నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ఆత్మ విమర్శ చేసుకొని జనగామ నియోజక వర్గంలో ఓటు అడగాలని అన్నారు అభివృద్ది చేయకుండా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చూపకుండా ఓట్లు అడిగే అర్హత BRS పార్టీకి లేదని అన్నారు .. నిరుద్యోగులు పేపర్ లీకేజీలతో ఆందోళన చెంది కోచింగ్ సెంటర్ లలో లక్షల ఫీజులు చెల్లించి ఎమ్మెల్సీ గా ఉన్న పల్ల రాజశేఖర్ రెడ్డి గారు కనీస స్పందన లేదని మండి పడ్డారు.. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం చూపకుండా అభివృద్ధి చూపకుండా కేవలం రాజకీయం చేస్తే ప్రజలు తగినగుణపాఠం నేర్పుతారు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో SFI జిల్లా అధ్యక్షుడు సందీప్ మరియు మండల నాయకులు సల్మాన్ ,నరేష్ ,రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు