
SFI ఆధ్వర్యంలో దద్దరిల్లిన కలెక్టర్ ముట్టడి.
ఎస్ఎఫ్ఐ భారతీయ విద్యార్థి ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మిశ్రీన్ సుల్తానా మరియు మంద శ్రీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి 10 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వ రంగ విద్యానూ తెలంగాణ ప్రభుత్వం కాపాడుకోలేకపోతుందని తెలియజేశారు. అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుండి 51751 కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీస్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదనపడ్డారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని పథకాన్ని ప్రవేశపెట్టారే తప్ప ఇప్పటివరకు ఆ పథకం అమలు జరిగింది లేదని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ గురుకులాలు, SMH హాస్టల్లో అద్దె భవనాలలో నడుస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి కనిపిస్తుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ప్రభుత్వవిద్య అందని ద్రాక్షగా మారుస్తుందని ఆవేదనపడతారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను మరియు లెక్చలర్ల పోస్టులను మరియు DEO MEO అలాగే DIEO పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ గురుకులాలు, KGVB, మోడల్ స్కూల్స్, యూనివర్సిటీ, విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్స్ మరియు కాస్మెటిక్ చార్జీలను వెంటనే పెంచాలని కోరారు, అదేవిధంగా నిర్దాక్షంగా తీసేసినటువంటి స్కావెంజర్ పోస్టులను వెంటనే యధావిధిగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన విద్యలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కోరారు. హనుమకొండ జిల్లా రెండో ఎడ్యుకేషన్ హబ్ గా రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్నప్పటికీ ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి రక్షణ తెలంగాణ ప్రభుత్వం కల్పించట్లేదని తెలియజేశారు. అదేవిధంగా హనుమకొండ జిల్లాలో కొత్త బీసీ,ఎస్సీ,ఎస్టీ SMH హాస్టల్ భవనాలను ఏర్పరిచి విద్యార్థులకు హాస్టల్ వసితిని కల్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పేర్కొన్నటువంటి సమస్యలను అదేవిధంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్లను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తీ చేయాలని హెచ్చరించారు. లేనిచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అదేవిధంగా రానున్న రోజుల్లో అసెంబ్లీ ముట్టడికి, ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు స్టాలిన్ మరియు బొచ్చు కళ్యాణ్ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శులు సూరం అనూష,హాథిరాం మరియు సాయి కృష్ణ లతోపాటు పరకాల మండల కార్యదర్శి ప్రశాంత్, యస్ ఆఫ్ ఐ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కమిటీ సభ్యులు మయూరి, వరుణ్, తేజ ,లతోపాటు 200 మంది విద్యార్థులు ఈ కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు