వేదించిన వ్యక్తికి మద్దతు పలికిన యజమానిపై కేసు నమోదు చేయాలి.
కె రాజయ్య సిఐటియు…
బొల్లారం పారిశ్రమిక వాడలో SNJ సింథటిక్ పరిశ్రమలో మహిళను లైంగిక వేధించిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని ,వేధించిన వ్యక్తికి మద్దతు పలికిన యజమాన్యంపై కేసు నమోదు చేయాలని సిఐటియు రాష్త్ర కమిటీ సభ్యులు కే రాజయ్య డిమాండ్ చేశారు.
ఎస్ ఎన్ జె సింథటిక్ పరిశ్రమలో దినసరి వేతన కూలీగా పనిచేస్తున్న ఓ మహిళ పట్ల అదే పరిశ్రమలో పని చేస్తున్న వ్యక్తి గత కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని , అసభ్యంగా మాట్లాడుతూ, ద్వంద్వ అర్ధాలతో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడo దుర్మార్గమని అన్నారు. వేధింపుల గురించి పరిశ్రమ జియం, హెచ్ ఆర్ మేనేజర్ కు ఫిర్యాదు చేస్తే తగ్గిన చర్యలు తీసుకోలేదని అన్నారు, అందుకే వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.