ఆలేరు మండలంను కరువు మండలంగా ప్రకటించాలి.
Yadadri Bhuvanagiriసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
ఆలేరు మండలం శర్భ నపురం గ్రామంలో ఎండిన వరి పంట పొలాలు సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలసి పరిశీలన చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఎండిపోయిన వరి పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మండలంలోని శ్రీనివాసపురం, పటేల్ గూడెం , తూర్పుగూడెం, శర్భానాపురం ఇలా అనేక గ్రామాలలో పంట పొలాలు ఎండిపోయాయని కావున ఆలేరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులు ఆరుగాలం శ్రమించి,అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ,పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మానసిక వేదనతో, దిక్కు తోచని పరిస్థితులల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ముందు చూపు లేకుండా యాసంగి సీజన్ ప్రారంభంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులు నేడు నష్ట పోయారని తెలియజేశారు. ఆలేరు మండలంలో అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉంది అని అన్నారు.అధికారులు యుద్ధప్రాతిపదికన ఆలేరు మండల వ్యాప్తంగా అన్ని గ్రా మాలలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి , నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్య క్రమం లో మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్యరాజయ్య,శర్బనపురం శాఖా కార్యదర్శి కారె రాజు,నాయకులు సూదగాని మల్లేష్, అంగడి యాదగిరి, గడ్డమీది యాదగిరి, బుగ్గ ఎర్రయ్య, రైతులు సిద్దులు, రామ నరసయ్య, యాదగిరి, యాదమల్లయ్య తదితరులు పాల్గొన్నారు