ఈ కార్యక్రమంలో బీజేవైఎం జనగామ జిల్లా అధికార ప్రతినిధి పూండ్రు నవీన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిధులు నియామకాల పైన కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో నేటి వరకు ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖల లేదు.ఉద్యోగం నోటిఫికేషన్ లో అనేక అవకతవకలు చేస్తూ నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కెసిఆర్ గారు అని అన్నారు.TSPSC లో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా TSPSC కార్యాలయం ముందు బీజేవైఎం నాయకులు నిరసన కార్యక్రమం తెలియజేస్తే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారిని మరియు బీజేవైఎం నాయకులు అక్రమంగా అరెస్టు చేసి వారిపై నాన్ బేలబుల్ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు అని కెసిఆర్ గారిని విమర్శించారు.నాడు అసెంబ్లీలో కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా తన కుటుంబ సభ్యులైన కానీ వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.నాడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య గారిపై & హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారిపై అవినీతి అభియోగాలు వస్తున్నాయని మంత్రివర్గం నుండి తొలగించారు మరి ఈ రోజు మీ కొడుకు (KTR) పై కూడా అవినీతి చేసిండు అని అభియోగాలు వస్తున్నాయి.ఎందుకు కేటీఆర్ గారిని మంత్రివర్గం నుంచి తొలగించడం లేదని కేసీఆర్ గారిన ప్రశ్నిస్తున్నాను.నాడు కరీంనగర్ లో కెసిఆర్ గారు యువతను ఉద్దేశించి జీన్ ప్యాంట్లు ఏమి చేస్తారని అంటే ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని అదేవిధంగా నేడు నిరుద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి కేసీఆర్ గారిని రానున్న రోజులలో నిరుద్యోగులు బిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తారని తెలియజేస్తున్నాను.వెంటనే కేటీఆర్ గారిని మంత్రి వర్గం నుండి తొలగించాలని కెసిఆర్ గారిని హెచ్చరిస్తున్నాము.లేనియెడల కేటీఆర్ గారిని మంత్రివర్గం నుండి తొలగించే వరకు బిజెపి మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నాలు,రాస్తారోకోలు మరియు ఉద్యమాలు చేస్తామని కెసిఆర్ గారిని హెచ్చరిస్తున్నాను.