
Special funds should be allocated for the development of Angadi
తేదీ: 3-8-2023 గురువారం రఘునాథ్ పల్లి అంగడి అభివృద్ధికి గ్రామపంచాయతీ ప్రత్యేక నిధులు కేటాయించి అంగడిలోని నీటి గుంతలు పూడ్చి గొర్రెల కాపరులు వ్యాపారులకు తాగునీరు, మూత్రశాలలు,మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం రేకుల షెడ్లు, జీవాలకు నీటితొట్లు,వాహనాల కోసం డక్క ఏర్పాటు చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జనగాం జిల్లా అధ్యక్షులు మోటే దేవేందర్.కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్ చేశారు.గురువారం జిఎంపిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా ప్రతినిధి బృందం రఘునాథ్ పల్లి అంగడిని సందర్శించి గొర్రెల మేకల పెంపకందారులు,చిరు వ్యాపారులను అంగట్లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మోటే దేవేందర్. సాదం రమేష్ లు మాట్లాడుతూ జిల్లాలో అంగళ్లను రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం చేయడం వల్ల ఆదరణ కరువై అనేక అంగళ్లు మూతపడున్నాయని అన్నారు.రఘునాథ్ పల్లి అంగడి కోసం స్థానిక పంచాయతీ పాలకవర్గం సరైన స్థలం కేటాయించకపోవటం వల్ల అంగడి అభివృద్ధికి నోచుకోవటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.రోడ్డుపైనే అంగడి నిర్వహించడం వల్ల వాహనదారులకు అసౌకర్యంగా ఉందని అన్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు బూరుధామయంగా మారిందిని విమర్శించారు.ప్రతి గురువారం నిర్వహించే ఈ అంగడికి సీజనులో చుట్టూ ఉన్న జనగాం. యాదగిరిగుట్ట. వరంగల్. హన్మకొండ గ్రామాల నుండి గొర్రెల,మేకల పెంపకందారులతోపాటు కూరగాయలు,ఇతర చిరు వ్యాపారులు వందల మంది వచ్చి వెళ్తుంటారని,ముఖ్యంగా మహిళలలకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంగడి ద్వారా స్థానిక గ్రామ పంచాయతీకి ప్రతి ఏటా సుమారు ₹30 లక్షల 6 వేల రూపాయలు ఆదాయం వస్తుండగా అంగడి అభివృద్దికి నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పించేందుకు పాలకవర్గం ముందుకు రాకపోవడం విచారకరం అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అంగళ్ల అభివృద్దికై నిధులు కేటాయించాలని,సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి GMPS రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నివేదిక అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు కావటి యాదగిరి.జిల్లా ఉపాధ్యక్షలు మేకల మల్లేష్.మండల అధ్యక్షులు గుండా వెంకటయ్య .మండల కార్యదర్శి గద్ద రాజు. మాయ రాములు.కిరాబోయన ప్రభాకర్ బాలబోయన శ్రీనివాస్.మద్దూర్ రాంనర్సయ్య. కావటి రాజయ్య.మరికొంతమంది పాల్గొన్నారు