
అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని తెలంగాణ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బెస్త సంపూర్ణ అన్నారు. బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ సైదులు, మరిపెడ ఎస్సై దూలం పవన్ కుమార్ లకు సమ్మె నోటీసు వివరాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా బేస్త సంపూర్ణ మాట్లాడుతూ సెప్టెంబర్10 నాటికి అంగన్వాడి సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని లేనియెడల సెప్టెంబర్ 11 నుండి సిఐటియు, ఏఐటియుసి అనుబంధ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవర్ధిక సమ్మె చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమ్మెకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు మంద పుష్ప, ప్రధాన కార్యదర్శి కుమ్మరి కుంట్ల జ్యోతి, నాయకురాలు అనబత్తుల రేణుక, గుమ్మడి కళమ్మ, సింతోజ్ లక్ష్మి, ముదిరెడ్డి శ్రీలత, తదితరులు ఉన్నారు