
itdda news teluu daily news local news e69news
మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజనులకు ఇప్పపువ్వు సేకరణ ద్వారా జీవనోపాధి పెంపొందించుకొని జీవించడానికి ఇప్పపువ్వు మొక్కలను పంపిణీ చేసి అంతరించిపోతున్న ఇప్పపువ్వు సేకరణలు మరల గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.
సోమవారం నాడు ఐటిడిఏ కార్యాలయం ఆవరణలో ఇప్పపువ్వు మొక్కలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో ఇప్ప చెట్టు ద్వారా వచ్చేఇప్పపువ్వు శ్రీరాముడికి అతి ప్రీతిపాత్రమైందని ఇప్పపువ్వు రాముల వారి ప్రసాదంలో కూడా వినియోగిస్తారని ఇప్పపువు ద్వారా గిరిజనులు మూడు నెలల పాటు జీవనోపాధి పొందుతారని అలాగే ఇప్పపువ్వు సేకరణ చేసిన తర్వాత వాటిని ఎండబెట్టి జిసిసికి విక్రయించి గిరిజనులు ఆర్థిక స్వలంబన దిశగా అడుగులు వేస్తారని అలాగే గిరిజనులు ఇప్పపువ్వు ద్వారా ఇప్పనూనె కూడా తీస్తారని ఇప్పనూనె వలన దీర్ఘకాలిక రోగాలకు ఉపయోగిస్తారని ఎన్నో లాభాలు ఉన్న ఇప్పపువ్వు సేకరణను గిరిజనులు సేకరించి ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏటిడిఓ నరసింహారావు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.