
సిఐటియు వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎం సాగర్
సిఐటియు వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎం సాగర్
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ నగరంలో లేబర్ కాలనీ భవన నిర్మాణ కార్మిక అడ్డా వద్ద బిల్డింగ్ & ఆదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రామిక మహిళ ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సాగర్ శ్రామిక మహిళా సంఘo జిల్లా కన్వీనర్ కె స్వప్న మాట్లాడారు.మహిళలపై జరుగుతున్న దోపిడీ,పీడనలకు వ్యతిరేకంగా పని గంటల తగ్గింపుకు,పని పరిస్థితుల మెరుగుకై,వేతనాల పెంపుకై,ఓటు హక్కుకై సుదీర్ఘ పోరాటల ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడిందన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి 115 ఏండ్ల చరిత్ర ఉందని,అంతకన్నా ఎక్కువ చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా మహిళల పోరాటాలకు ఉందన్నారు.తరతరాల నుండి మన సమాజంలో ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో వేళ్ళూలుకొని ఉండటం మూలాన మహిళలు అవమానాలకు,హింసకు,దాడులకు గురవుతూనే ఉన్నారన్నారు.శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతిని సాధించామని అభివృద్ధి వైపుకు దూసుకుపోతున్నామని మన పాలకులు చెప్పుకుంటున్నప్పటికీ ఆడ పిల్లలపై,మహిళలపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయని మహిళకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్రక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీడింగ్ సంఘo నగర అధ్యక్షులు కె రఘపతి మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.