బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్రంలో బిఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటుచేసి గ్రామీణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దామని స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకులు,బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో స్వేరోస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డి,క్రికెట్ టోర్నమెంట్లను శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందించడమే కాక మనిషికి,మనిషికి మధ్య ప్రేమానురాగాలు పెంచుతాయని తెలిపారు.క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా యువత దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు.
సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శిగా పనిచేసిన కాలంలో గురుకుల విద్యార్థుల కోసం క్రికెట్ అకాడమీ, బాక్సింగ్ అకాడమీ,కబడ్డి అకాడమీ,సాఫ్ట్బాల్ అకాడమీ, బాక్సింగ్ వంటి 46 క్రీడా అకాడమీలను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.నడిగడ్డ ప్రాంతంలో క్రీడాకారులకు పేదరికం అడ్డురాకూడదన్న ఆయన క్రీడాకారులను అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగేందుకు నిరంతరం ప్రోత్సహిస్తామని తెలిపారు.స్వేరోస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దెందుకు నిర్వాహకులు నిరంతరం కృషి చేస్తున్నారని నిర్వాహకులను అభినందించారు.ఈ క్రీడా పోటీల్లో జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా వందలాది టీమ్ లు టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎం.సి కేశవరావు,అలంపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, మధు గౌడ్,స్వామి దాస్,చిన్న, హన్మన్న,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.