
ఈ69 న్యూస్ ధర్మసాగర్ అక్టోబర్ 7
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని వైకుంఠధామంపై పలువురు గ్రామస్తులు విమర్శలు కురిపిస్తున్నారు,సాయంత్రం వేళలో మృతదేహంతో వైకుంఠధామానికి చేరుకోగా లైట్ల సౌకర్యం లేక అంధకారంలో వైకుంఠధామం ఉండేసరికి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారు ఇంటి పన్ను నల్లా పన్ను వసూలు చేయడం తెలుసు కానీ వైకుంఠధామం పరిస్థితి తెలవదా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
పై అధికారులు స్పందించి వెంటనే సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలన్నారు.మేము ఇది చేశాం అది చేశాం! అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదు.కనీసం ఇలాంటి విషయాలపై కూడా అవగాహన లేకపోవడం శోచనీయం ఇప్పటికైనా వైకుంఠధామంలో సరైన వసతులు ఏర్పాటు చేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.