
ఒకవైపు రైతులు పంట నష్టపోయి ఏడుస్తుంటే మరోవైపు ఆత్మీయ సమావేశాలని బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు కోలాటలు, DJ డాన్స్ లు చేయడం సిగ్గుచేటు
రఘునాథపల్లి మండలం ఆంధ్ర తండా మరియు పలు గ్రామంలో తీవ్రమైన గాలులు,వర్షం వల్లన నష్టపోయిన పంటల్ని పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పండించిన పంట నీటిపాలు కావడంతో రైతులకు కన్నీళ్ళే మిగిలాయన్నారు. ప్రభుత్వ అధికారులు సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలన్నారు. దాన్యంకొట్టుకుపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు.రాష్ట్రంలో ఎక్కడ పంట నష్టం జరిగినా పట్టించుకోని సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.రైతే రాజని మాట్లాడుతున్న పాలకులు వారిని ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయకుండా,రైతులను గోస పెడుతున్న కల్వకుంట్ల నియంత పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వల్లాల వెంకటేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి ద్యావర రాజు, బీజేవైఎం మండలం అధ్యక్షులు మల్కాపురం శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి శరత్,రైతులు తదితరులు పాల్గొన్నారు.