
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా అక్రమ అరెస్టు చేసిన సిపిఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని సిపిఎం పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ అన్నారు. నేడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో రాజ్ భవన్ ముట్టడికి సిపిఎం పిలుపు ఇచ్చిన సందర్భంగా పరకాల మరియు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసిన సిపిఎం నాయకులు విడుదల చేయాలన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు