అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం ( ఐద్వా)
జాతీయ మహాసభల గోడ ప్రతులు ఆవిష్కరించిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిదయానంద్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా)
అఖిలభారత మహాసభలు హైదరాబాద్ నగరంలో ఈనెల 25 నుండి 28వ తేదీ వరకు జరగనున్నాయి.అట్టి జాతీయ మహాసభల జయప్రదం కోరుతూ ముద్రించిన గోడప్రతులను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆవిష్కరణ చేశారు.అనంతరం ఐద్వా నాయకురాళ్లు సీపీఎం కార్యాలయం ఎదుట ముగ్గులు వేసి సందడి చేశారు.మహిళా హక్కులు కోసం నిరంతరం పనిచేస్తున్న ఐద్వా జాతీయ మహాసభలు విజయవంతం కావాలని కోరుతూ పట్టణంలో ఐద్వా జెండాలు చేత బూని రాత్రి పూట ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో: ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి,రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం కరుణ,సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు చెరకు రత్నకుమారి, కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, జాజిరి జ్యోతి,మిట్టపల్లి నాగమణి, పుష్పవల్లి,పాకలపాటి ఝాన్సీ,రాయల రాణిరుద్రమదేవి తదితర మహిళలు పాల్గొన్నారు.