అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు
మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిర్వహించిన మిల్కా సింగ్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో అండర్ 16 బాలుర విభాగంలో నీతేష్ షాట్ పుట్ – బంగారు పతకం, 100మీటర్ల పరుగు పందెం లో బంగారు పతకం, లాంగ్ జంప్ లో బంగారు పతకం సాధించగా, హారిక అండర్ -19 బాలిక విభాగం 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం మరియు నిత్య అండర్-16 బాలికల 16 విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం, అండర్- 14 బాలుర విభాగం 60 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం,4×100 రిలే పరుగు పందెంలో బంగారు పతకం, అండర్ 16 బాలుర విభాగంలో నితేష్ కాంస్య పతకం సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థులను మరియు పిఈటి వెంకటరమణను పాఠశాల కరస్పాండెంట్ ఆర్.అనురాధ రెడ్డి,ఇన్చార్జ్ కే.శశికళ, తైక్వాండో మాస్టర్ తులసిరామ్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.