
అనంతుల రిషితను సన్మానిస్తున్న పిఎసిఎస్ చైర్మన్ పుట్టా రమేష్
నీట్ ఎంట్రన్స్ లో ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ లో సీటు పొందిన అనంతుల రిషితను నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ పుట్టా రమేష్ బుధవారం తమ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని బృందావనపురం గ్రామ మాజీ సర్పంచ్ అనంతుల ఆంజనేయులు కుమార్తె రిషిత మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నీట్ ఎంట్రెన్స్ లో ర్యాంకు సాధించి మెడికల్ కౌన్సిలింగ్ లో ఆర్ వి యం సిద్దిపేట కళాశాలలో మెడికల్ సీటు సాధించడం పట్ల గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారని అన్నారు. డాక్టర్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనంతుల ఆంజనేయులు, పుట్టా సీతయ్య, కార్యాలయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.