తెలుగుగళం న్యూస్, పామిడి, సెప్టెంబర్ 23:
పామిడి పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు మంగళవారం అన్నపూర్ణ దేవి గా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకం అర్చన చేశారు. మధ్యాహ్నం మహిళలు భక్తి గీతాలు ఆలపించారు. రాత్రి వాసవి సహస్ర నామ కుంకుమ అర్చన వాసవి మాతృ మండలి వారు నిర్వహించారు.బాలలకు వాసవి మాత జీవిత చరిత్ర పై క్విజ్ నిర్వహించి వారికి బహుమతి ప్రధానం చేశారు. బాలల్లో అమ్మవారి త్యాగానిరతి పై అవగాహన పెంచి భక్తి మార్గం పెంపొందించేందుకు క్విజ్ ఏర్పాటు చేశామని మాతృ మండలి గౌరవఅధ్యక్షురాలు కె. రాజేశ్వరి, అధ్యక్షురాలు ఎన్వియస్. నాగవల్లి అన్నారు.
