అలా చేస్తే 54200 మంది వీధిన పడతారు: ఏఐటియుసి
ప్రభుత్వ పాఠశాలలో పని చేసే మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు10 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి నిమ్మటూరి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం సత్తుపల్లి లో జరిగిన మిడ్ డే మీల్స్ కార్మికుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పథకాన్ని అక్షయపాత్ర,హరేరామహరేకృష్ణ అనే స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.54200 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నష్టపోతారన్నారు. ఈకార్యక్రమంలో:రహమున్నీసా,సక్కుబాయి,వెంకమ్మ,అనసూయ,కృష్ణవేణి,కనకదుర్గ,బసవయ్య,రామారావు తదితరులు పాల్గొన్నారు.